• Neti Charithra

ఏపీలో కొనసాగుతున్న కరోనా..11 జిల్లాల్లో పెరిగిన మృతులు.. 24 గంటల్లో 4944 మందికి పాజిటివ్..!


ఏపీలో కొనసాగుతున్న కరోనా..11 జిల్లాల్లో పెరిగిన మృతులు.. 24 గంటల్లో 4944 మందికి పాజిటివ్..!



అమరావతి: నేటి చరిత్ర

(జిల్లాల వారీగా కరోనా పాజిటివ్)


ఏపీలో కరోనా రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీగా కరోనా టెస్టులు నిర్వహిస్తుండగా.. కేసులు కూడా అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మరోసారి

రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే రికార్డు స్థాయిలో ఒకే రోజు ఏకంగా 62 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 37,162 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 4,944 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 58,668కు చేరింది.

ఇక గడచిన 24 గంటల్లో ఏకంగా 62 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 758కు చేరింది. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, విశాఖపట్నంలో 9 మంది, చిత్తూరులో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు,

అనంతపురంలో ఆరుగురు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు.

ఇక గడిచిన 24 గంటల్లో 1,232 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.


266 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon