• Neti Charithra

ఏపీ లో ఒక్క రోజే 7998 మందికి కరోనా... 61 మంది మృతి..!


ఏపీ లో ఒక్క రోజే 7998 మందికి కరోనా... 61 మంది మృతి..!



అమరావతి: నేటి చరిత్ర


ఎపిలో కరోనా విలయతాండవం చేస్తోంది. జిల్లాల్లోనే వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, రాష్ట్రంలో ఒక్కరోజే 7,998 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని ఎక్కువ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,391 కేసులు

నమోదవగా, గుంటూరు జిల్లాలో 1,184, అనంతపురం జిల్లాలో 1,016 కేసులను గుర్తించారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 72,711కి చేరింది. మరణాలు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 61 మంది

మృతి చెందారు.దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 884కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో 14 మంది, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఏడుగురు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. 37,555 మంది డిశ్చార్జి కాగా, 34,272 మంది చికిత్స పొందుతున్నారు.


275 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon