• Neti Charithra

ఏపీ లో ఐదు వేల కు చేరువలో.. కరోనా పాజిటివ్ కేసులు.. కలవర పడుతున్న ప్రజలు!


ఏపీ లో ఐదు వేల కు చేరువలో.. కరోనా పాజిటివ్ కేసులు.. కలవర పడుతున్న ప్రజలు!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

అందరిని కలవర పెడుతోంది. తాజా గా

24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 154 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4813కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసులు 28 ఉండగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి ఒక కేసు నమోదు అయ్యింది.

 తాజాగా 34 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2387కి చేరింది. ఇప్పటి వరకూ 75 మంది ప్రాణాలు కోల్పోయారు.




272 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon