• Neti Charithra

ఏపీలో ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరో సారి వాయిదా వేసిన ప్రభుత్వం!


ఏపీలో ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరో సారి వాయిదా వేసిన ప్రభుత్వం!



అమరావతి: నేటి చరిత్ర



మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా జులై ఎనిమిదో తేదీన రాష్ట్రంలోని 25 లక్షల మంది పేదలకు చేయాలనుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే చాలా చోట్ల ఇంకా పంపకానికి భూమి సిద్దం కాకపోవడం వల్లనే పంపిణీ కార్యక్రమం

వాయిదా వేసినట్లు తెలిసింది. ప్రభుత్వం వైపు నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ అగస్టు 15వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ జరనున్నట్లు సమాచారం. కాగా వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా రేపు సాయంత్రం సిఎం జగన్మోహన్‌రెడ్డి పులివెందుల చేరుకుంటారు. ఎనిమిదో తేదీన వైఎస్‌ఆర్‌ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమాలకు పరిమితసంఖ్యలోనే ప్రజలను అనుమతిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.



516 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon