• Neti Charithra

ఏపీ రాజధాని లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లే..నా !

ఏపీ రాజధాని లో స్థానిక సంస్థ ల ఎన్నికలు లేనట్లే..నా!

అమరావతి: నేటి చరిత్ర (జనవరి 13)

ఏపీ రాజధాని పరిసరాల లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడే సూచనలు కనబడుతోందితున్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా కాలంగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు. తాజాగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయించాలని ఎన్నికల సంఘానికి ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది లేఖ రాశారు. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్‌గా గుర్తించాలని, ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని ప్రతిపాదనలు పంపారు. యర్రబాలెం, బేతపూడి, నవులూరును మంగళగిరి పురపాలికలో కలపాలని, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలని ప్రతిపాదించారు. మిగిలిన గ్రామాలన్నింటినీ కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దింతో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల పై నీలి నీడలు అలుముకున్నాయి.

40 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon