• Neti Charithra

ఏపీ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ గా లక్ష్మీపార్వతి నియామకం!

#ఏపీ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ గా లక్ష్మీపార్వతి నియామకం!

అమరావతి: నేటి చరిత్ర (నవంబర్6) ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా వైకాపా ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా పార్టీకి సేవలందిస్తూ వచ్చినందున లక్ష్మీపార్వతికి ఈ పదవి దక్కింది. వైకాపా మహిళా నేతల్లో ముఖ్యులుగా ఉన్న ఎమ్మెల్యే రోజా, వాసిరెడ్డి పద్మకు కూడా గతంలో కీలక పదవులు దక్కగా తాజాగా మరో మహిళా నేత లక్ష్మీపార్వతి కి ప్రాధాన్యత కలిగిన పదవి వరించింది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon