• Neti Charithra

ఏపీ చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని.. పదవీ కాలం.. పొడిగింపులో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం !


ఏపీ చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని.. పదవీ కాలం.. పొడిగింపులో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం !


అమరావతి: నేటి చరిత్ర



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. జూన్ నెలఖరుతో ఆమె పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు పొడిగించాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ

రాశారు. ఈ మేరకు స్పందించిన కేంద్రం సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి అయిన నీలం సాహ్ని నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా సీఎస్. ఎల్‌.వి.సుబ్రమణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయడంతో ఆయన స్థానంలో నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆమె పదవీకాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.




110 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon