• Neti Charithra

ఏపీ కేబినెట్ లో జగన్ తర్వాత ' పెద్దిరెడ్డి' దే రెండవ స్థానం- డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

#ఏపీ కేబినెట్ లో జగన్ తర్వాత ' పెద్దిరెడ్డి' దే రెండవ స్థానం- డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

చెన్నై: నేటి చరిత్ర(అక్టోబర్7) ఏపీ కేబినెట్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే బలమైన నేత అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. తమిళనాడులో జరిగిన తెలుగు భాషాభివృద్ధి సంఘం ఆద్వర్యం లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి హాజరు అయిన ఇద్దరు మంత్రులు ప్రసంగించారు. తెలుగు ప్రజల అభ్యున్నతితో పాటు, తెలుగుభాషా పరిరక్షణకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. తమిళనాడులో మైనారిటీల హక్కుల కోసం కృషి చేస్తూ, న్యాయ పోరాటాలు చేస్తున్న డా.సీఎంకే రెడ్డి జన్మదినోత్సవం ఆదివారం నగరంలోని కొరట్టూర్‌నార్త్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ తమిళనాట తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు ఉందని, చిత్తూరు జిల్లాలో దాదాపు 100 పాఠశాలల్లో తమిళ మాధ్యమం కొనసాగిస్తున్నామన్నారు. తమిళనాడులో తెలుగు మాధ్యమాన్ని ఆపేస్తే తెలుగు చదువుతున్న వారికి ఇబ్బంది కలుగుతుందని సీఎంకే రెడ్డి కోరిన వెంటనే ఏపీ నుంచి అధికారులకు చెప్పి తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాయించామన్నారు. నారాయణ స్వామి మాట్లాడుతూ పెద్దిరెడ్డి మాట ఇస్తే జగన్‌మోహన్‌రెడ్డి లాగా మాట తప్పరని, క్యాబినెట్‌లో జగన్‌ తర్వాత పెద్దిరెడ్డి ప్రధానమైన వ్యక్తి అన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon