• Neti Charithra

ఏఎస్పీ విమల కుమారి సేవలను కొనియాడిన శ్రీసిటీ.. ప్రతినిధులు !


ఏఎస్పీ విమల కుమారి సేవలను కొనియాడిన శ్రీసిటీ.. ప్రతినిధులు !



శ్రీసిటీ: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా వాణిజ్య నగరం శ్రీసిటీ డీఎస్పీగా పనిచేస్తూ ఇటీవల ఏఎస్పీగా పదోన్నతి పొందిన విమలకుమారికి శుక్రవారం శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో అభినందన సభ ఏర్పాటుచేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, పలు పరిశ్రమల సీఈఓలు, శ్రీసిటీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు శాలువలు కప్పి అభినందనలు తెలిపారు...

ఆమె చేసిన సేవలను పలు సంస్థల ప్రతినిధులు కొనియాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీసిటీలో సర్వీసు తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిందన్నారు. గతంలో తనలో వృత్తిరీత్యా ఆవేశం, కఠినత్న లక్షణాలు వుండేవని, శ్రీసిటీలో పనిచేసిన తరువాత అవన్నీ మాయమయ్యాయన్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో కూడా పనిచేశానని, అక్కడ కార్మిక యూనియన్లు, ఇతరత్రా సమస్యలతో పనిలో ఒత్తిడి ఉండేదని, ఇక్కడ పూర్తి భిన్నమైన వాతావరణం ఉందన్నారు. ఎన్నాళ్ళు పనిచేస్తానో అని అన్యమనస్కంగానే ఇక్కడ భాద్యతలు చేపట్టానని, ప్రస్తుతం విడిచి వెళ్లడానికి మనస్కరించడం లేదన్నారు. శ్రీసిటీ యాజమాన్యం నుంచి గాని, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల నుంచి గాని ఎలాంటి ఒత్తిడి ఇక్కడ లేదని, ఓ మంచి వాతావరణంలో స్వేచ్ఛగా తన విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులు ఎంతో క్రమశిక్షణ కలిగి వున్నారని, ఏదైనా లోపాలు ఎత్తిచూపితే వెంటనే సరిదిద్దుకునేవారని తెలిపారు. వారి స్థాయి, విద్య నాకంటే ఎంతో ఉన్నతమైనప్పటికీ, ఏదైనా చెబితే టీచర్ ముందు విద్యార్థిలా నా సూచనలు పాటించేవారని, అది వారి గొప్పదనానికి

నిదర్శనమన్నారు. శ్రీసిటీ కుటుంబం మొత్తం వారింటి ఓ ఆడపడుచుగా నాపై ఆప్యాయత చూపారన్నారు. ఇక్కడ ఉద్యోగులే కాకుండా వారి కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపుల్లోనూ నేను సభ్యురాలుగా వున్నానని, పోలీసుపరమైన సమస్యలతో పాటు వారి వ్యక్తిగత కుటుంబ సమస్యలు కూడా నాతో చెప్పేవారన్నారు. ఇక్కడకు పోలీసుగా వచ్చిన నేను ఓ టీచరుగా మారిపోయానని ఆమె పేర్కొన్నారు.


64 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon