• Neti Charithra

ఏఎస్ఐ.. ఇండ్ల పై ఏసీబి దాడులు.. కోట్ల లో పట్టు బడ్డ ఆక్రమాస్తులు!

#ఏఎస్ఐ.. ఇండ్ల పై ఏసీబి దాడులు.. కోట్ల లో పట్టు బడ్డ ఆక్రమాస్తులు!

కాకినాడ : నేటి చరిత్ర (నవంబర్6) ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంతో కాకినాడ పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న జీవీవీ సత్యనారాయణ చౌదరి ఇంట్లో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కాకినాడతో పాటు సామర్లకోట, రావులపాలెంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ రవికుమార్‌ ఆధ్వర్యంలో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటల వరకు సోదాల్లో గుర్తించిన ఆస్తుల వివరాలను ఏఎస్పీ రవికుమార్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో సత్యనారాయణ చౌదరికి సుమారు రూ.రెండున్నర కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని ఏఎస్పీ తెలిపారు. ఈ సోదాలు కొనసాగుతున్నాయని మరిన్ని అక్రమాస్తుల వెలుగు చూసే అవకాశం ఉందన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon