• Neti Charithra

ఏఎన్ఎం నిర్లక్ష్యానికి - పసిపాప బలి


అధిక మోతాదులో టీకా: టీకా వికటించి - పాప:

వాయల్పాడు (UPDATED) : ఏఎన్ఎం తీవ్ర నిర్లక్ష్యానికి పసిపాప బలైన సంఘటన చోటుచేసుకుంది... వాల్మీకిపురం(వాయల్పాడు) మండలం, గండబోయనపల్లి గ్రామ పంచాయితీ,యర్థావాoడ్లపల్లి గ్రామానికి చెందిన శైలజకు రామకుప్పం మండలానికి చెందిన సుధాకర్ తో వివాహం అయ్యింది.కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో ప్రసవించింది.అనంతరం తన సొంత గ్రామానికి వచ్చింది.శైలజ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.పాప ఆరోగ్యంగా వుంది.సకాలంలో ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా వివిధ టీకాలు వేయాల్సి ఉంది.ఆస్పత్రిలో కొన్ని టీకాలు వేశారు.అనంతరం టీకాల బాధ్యత స్థానిక ఏఎన్ఎంది.టీకాలు వేయడం వారి బాధ్యత..రెండు నెల టీకా వేయాల్సి ఉంది.ఈ విషయమై తల్లి శైలజ పలుమార్లు ఏఎన్ఎం దృష్టికి తీసుకెళ్లారు.బిడ్డకు టీకా వేయించాలని కోరారు.అయితే ఆమె పట్టించుకోలేదు.అక్కడున్నా..ఇక్కడున్నాను..ఏదో వీధుల్లో ఉన్నాను..నాకు సమయం లేదంటూ తప్పించుకోనేలా వ్యవహరించింది..దీంతో ఏఎన్ఎం ఉన్న చోటుకి వెళ్లి టీకాలు వేయించాలని అడిగారు.నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.మరో ఏఎన్ఎం వేస్తుందని ఆమెకు వద్దకు వెళ్లాలని సూచించారు..అక్కడికి వెళ్లి వెళ్లారు.ఆమె(రెండు నడుముకు,ఒకటి చేతికి)మూడు టీకాలు వేసింది.నోట్లో చుక్కల మందు మోతాదుకు మించి వేసింది.రెండు రోజుల అనంతరం టీకా వేసిన ప్రాంతం నలుపు రంగులోకి మారింది.కాలు పూర్తిగా పాడైపోయింది.నీలి వర్ణంలోకి మారి పోయింది..వికటించి పసి బిడ్డ మృత్యువాత పడింది..ఏఎన్ఎం విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నేటి బాలిక రేపటి భవిష్యత్తు లేకుండా మృత్య ఒడిలోకి చేరాల్సిన దుస్థితి దాపురించింది.తల్లికి గర్భ శోకాన్ని మిగిల్చింది.ఏఎన్ఎం నిర్లక్ష్యంతో నవమాసాలు మోసిన బిడ్డను పోగొట్టుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు..కన్నీటి పర్యంతమయ్యారు.తమ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారులకు(జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు పోలీస్స్టేషన్లో )ఫిర్యాదు చేశారు.న్యాయం జరుగుతుందని ఎదురుచూశారు.ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదు.తల్లి పిల్లల సంరక్షణే ధ్యేయంగా స్థానికంగా ఏఎన్ఎంలను ప్రభుత్వం నియమించింది.వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత వారిదే.అలాంటిది నిర్లక్ష్య వైఖరితో నడుచుకుని పాప మృత్యువాతకు కారణమైన ఏఎన్ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలి.


Advertisement: