- Neti Charithra
ఎంపీ మిథున్ రెడ్డి గారు.. మదనపల్లె కు న్యాయం చేయండి- మదనపల్లె జిల్లా సాధన కమిటీ..!
ఎంపీ మిథున్ రెడ్డి గారు.. మదనపల్లె కు న్యాయం చేయండి- మదనపల్లె జిల్లా సాధన కమిటీ..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరుజిల్లా మదనపల్లె ను జిల్లా కేంద్రం
చేయాలని మదనపల్లె జిల్లా సాధన కమిటీ ప్రతినిథులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని కోరారు. ఆదివారం ఆయన మదనపల్లె లో పర్యటించిన సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి ని కలిసి భౌగోళికంగాను,
మౌలిక వసతులుగాను, భవనాల వసతులుగాను అనువైన పట్టణంగా ఉంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మదనపల్లె ను జిల్లా కేంద్రం చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లి జిల్లా సాధన సమితి కో కన్వీనర్ లు.. శ్రీ చందు, విద్యార్థి నాయకులు ఉత్పన్న లక్ష్మీపతి,
పొదల నరసింహులు, ఎన్జీఓల సంఘం సుధాకర్ గారు, కొండపల్లి ఆనంద్, బార్ అసోసియేషన్ నాయకులు సోమశేఖర్, భాష నాయకులుజన గిన్నెల మనోహర్‌రెడ్డి, రవి, కృష్ణ, జన కరాటే మురళి,,, తదితరులు పాల్గొన్నారు