• Neti Charithra

ఎరువుల దుకాణాల పై విజిలెన్స్అధికారుల దాడులు...కేసుల నమోదు..!


ఎరువుల దుకాణాల పై విజిలెన్స్అధికారుల దాడులు...కేసుల నమోదు..!




కర్నూలు: నేటి చరిత్ర


కర్నూలు నగరం లో విజిలెన్స్ అధికారులు

రైతుల వేషంలో వెళ్లి ఎరువుల దుకాణాల్లో

ఆకస్మిక తనిఖీలు చేశారు.. ఈ తనిఖీల్లో యురియాను రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. విజులెన్స్ సిబ్బంది రైతుల వేషంలో దుకాణాలకు వెళ్లి యురియాను కొనుగోలు చేసి బిల్లు వేయించుకున్నారు. రూ. 266 విక్రయించాల్సిన యురియా బస్తాను

రూ.300కు నాలుగు షాపుల్లో విక్రయిస్తున్నాట్లు గుర్తించారు. ఈ షాపుల్లో రూ.4 లక్షల రూపాయల విలువ చేసే 30 టన్నుల యురియాను సీజ్ చేశారు. వ్యవసాయ అధికారులకు ఈ నాలుగు షాపుల యజమానుల పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. విజులెన్స్ ఎన్ఫోర్స్మోంట్ ప్రాంతీయ అధికారి తిరుమలేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.


233 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon