• Neti Charithra

ఎర్ర చందనం రవాణా పై ఉక్కుపాదం మోపండి- డి ఐ జి క్రాంతి రానా టాటా..!


ఎర్ర చందనం రవాణా పై ఉక్కుపాదం మోపండి- డి ఐ జి క్రాంతి రానా టాటా..!




తిరుపతి: నేటి చరిత్ర


తిరుపతి కపిల తీర్థం సమీపంలోని ఏపీ టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని మంగళవారం అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణా టాటా సందర్శించారు. కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు డీఎస్పీ వెంకటయ్య నుంచి స్వాగతం పలికారు. అనంతరం టాస్క్ ఫోర్స్ అధికారులు , సిబ్బందితో

సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణ లో సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో అక్రమ రవాణా అరికట్టేందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. కోవిడ్-19 వైరస్

నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుప్రజ, సీఐ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ భాస్కర్, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.


102 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon