• Neti Charithra

ఎర్ర చందన దుంగల నిల్వల పై టాస్క్ ఫోర్స్ దాడులు.....

#ఎర్ర చందన దుంగల నిల్వల పై టాస్క్ ఫోర్స్ దాడులు..

తిరుప‌తిః నేటి చరిత్ర తిరుపతి అలిపిరి, పెరుమాళ్ల పల్లి మార్గంలోని టిటిడి అధీనంలో ఉన్న అటవీ ప్రాంతంలో భూమిలో దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐ వాసు, డీఆర్ఒ పివి నరసింహారావు టీమ్ శనివారం రాత్రి నుంచి ఎపి టూరిజం వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతం నుంచి కూంబింగ్ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్మగ్లర్లు దుంగలతో రావడం కనిపించింది. వారు దగ్గరకు వచ్చిన తరువాత వారిపై దాడి చేయడానికి సిద్దపడ్డారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బందిని గమనించి దుంగలను పడవేసి పారిపోయారు. పారిపోయే క్రమంలో ఒక ఎత్తైన గుట్టను ఎక్కి సిబ్బందిపై రాళ్లు విసిరారు. వారి దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకో గలిగారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించగా తమిళనాడు తిరువన్నామలై జిల్లా మాటుకొన్నూరుకు చెందిన దురైరాజ్ (45)ను పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో పడవేసిన 12 దుంగలు లభించాయి. పట్టుబడిన స్మగ్లర్ ను విచారించగా టిటిడి అధీనంలో ఉన్న అటవీ వారం రోజుల ముందు వచ్చామని ఎర్ర దుంగలను తీసుకుని వచ్చి ఇసుకలో, వాగులోను, ముళ్ల కంపలలోను కొన్ని దుంగలను దాచి ఉంచినట్లు తెలిపాడు. వీటిని త‌వ్వించ‌గా ఎనిమిది దుంగలు లభించాయి. సమాచారం అందుకున్న వెంటనే టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు.‌దుంగలు ఏఏ ప్రాంతాలలో దాచి ఉంచారో తెలుసుకుని వాటిని వెలుపలకు తీయించారు. సిబ్బందిని అభినందించారు. ‌ఆయనతో పాటు డీఎస్పి అల్లా బక్ష్, ఆర్ ఐ లు మురళీ, చెందు చేరుకుని పరిస్థితి ని సమీక్ష చేశారు. తదుపరి విచారణ కోసం టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon