• Neti Charithra

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి.. చొరవతో.. చిత్తూరుజిల్లా కు తప్పిన.. భారీ కరోనా.. ముప్పు!


ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి చొరవ తో చిత్తూరుజిల్లా కు తప్పిన భారీ కరోనా

. ముప్పు!


కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా తంబల్లపల్లె ఎమ్మెల్లే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి ముందస్తు చర్యలు తో జిల్లాలో ని ఆరు మండలాల్లో కరోనా ముప్పు తప్పింది. జిల్లా లో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు రాజస్థాన్ లోని అజ్మీర్ పర్యటన కు వెళ్లారు.


లాక్ డౌన్ కారణం గా సుమారు 45 రోజులు వారు అక్కడే ఉండి పోయారు. వారి అభ్యర్థన మేరకు ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక వాహనాలలో సొంత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా తంబల్లపల్లె ఎమ్మెల్లే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి ప్రత్యేక చొరవ తో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 77 మందిని తంబల్లపల్లె నియోజకవర్గం అంగళ్ళు గోల్డెన్ వ్యాలీ లోని కరోనా రిలీఫ్ సెంటర్ కు తరలించి అధికారుల సహకారం తో వారికి ఖరీదైన కరోనా పరీక్షలు చేయించారు.

(అంగళ్ళు నుంచి ప్రత్యేక బస్సుల్లో క్వారెంటె న్ చికిత్సలు కు బస్సుల్లో బయలు దేరుతున్న బాధితులు)

ఈ పరీక్షల్లో చిత్తూరు, పాకాల, పులిచెర్ల, సదుం, కల్లూరు, దామల చెరువు మండలాలకు చెందిన 11 మందికి కరోనా పాజిటివ్ తేలడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పొరపాటున వీరందరూ నేరుగా సొంత ప్రాంతాలకు వెళ్లి ఉంటే.. భారీ నష్టం జరిగి ఉండేది.

తాజాగా ఎమ్మెల్లే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి జిల్లా అధికారులతో చర్చించి శుక్రవారం అర్ధరాత్రి పాజిటివ్ కేసులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి పంపించి.. మిగిలిన వారికి తిరుపతి లోని ప్రత్యేక క్వారెంటాయిన్ కేంద్రానికి బస్సుల లో తరలించే చర్యలు తీసుకున్నారు.

స్థానిక ఎమ్మెల్లే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి చొరవతో జిల్లా పెనుప్రమాదం తప్పటం తో ఎమ్మెల్లే ను పలువురు అభినందిస్తున్నారు.

1,169 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon