• Neti Charithra

ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి కి సమస్యల పై వినతి పత్రాలు!

#ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి కి సమస్యల పై వినతి పత్రాలు!

బి కొత్తకోట: నేటి చరిత్ర (సెప్టెంబర్29) చిత్తూరు జిల్లా బి కొత్తకోట ఫోటో స్టూడియో యూనియన్ నాయకులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి ని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆదివారం బి కొత్తకోట లో ఆయన్ను కలిసి తమకు ప్రభుత్వం పక్కాగృహాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ల తో ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమం లో ఫోటో స్టూడియో యూనియన్ నాయకులు అక్బర్, ఎస్ ఎమ్ రఫీ, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగ విఆర్ ఏ లను గ్రామ సచివాలయాల్లో అవకాశం కల్పించాలని కోరుతూ మండల విఆర్ ఏ లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కి వినతి పత్రాలు అందజేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon