• Neti Charithra

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దారుణ హత్య!

#ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దారుణ హత్య!

అనంతపురం: నేటి చరిత్ర (నవంబర్30) అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు జగుల్లాప్రకాశ్ శనివారం పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం టౌన్ పల్లవి టవర్స్ దగ్గర ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు జాగుళ్ల ప్రకాష్ ను శనివారం 2గం. ల సమయంలో ప్రత్యర్థులు కత్తులతో దాడి చేయడంతో ఆయన రక్తపు మడుగు లో అక్కడే మృతి చెందాడు . సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు పట్ట పగలు అతి కిరాతకంగా కత్తులతో హత్యకు పాల్పడటం.. అనంతపురం లో కలకలం రేపింది. ఈ హత్య విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పోలీస్ ఉన్నతాధికారుల తో మాట్లాడుతూ నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon