• Neti Charithra

ఎప్పటి కప్పుడు వ్యాధుల ను గుర్తించండి- వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ దుర్గా ప్రసాద్

#ఎప్పటి కప్పుడు వ్యాధుల ను గుర్తించండి- వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ దుర్గా ప్రసాద్

చిత్తూరు: నేటి చరిత్ర (అక్టోబర్25) అసంక్రమిత వ్యాధులు ను వీలయినంత తొందరగా గుర్తించి చికిత్స నిర్వహించాలని ఏ. పి.వి.వి.పి.కమిషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ అన్నారు. చిత్తూరు డి.ఎమ్.హెచ్.ఓ.కార్యాలయంలో వైద్యాధికారులు కు జరుగుతున్న ఎన్. సి.డి.శిక్షణ కార్యక్రమం ను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హైరిస్క్ గర్భవతులు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సంయుక్త సంచాలకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ హెల్త్ వెల్నెస్ సెంటర్ లలో అసంక్రమిత వ్యాధులు పై ప్రతీ రోజు స్క్రీనింగ్ చేసి శుక్రవారం ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. ప్రతీ వైద్యాధికారి,స్టాఫ్ నర్స్ ఎన్. స్.స్.కె మరియు దక్షత శిక్షణ లు పొందాలన్నారు. ర్.ఎన్. టి.సి.పి. డైరెక్టర్ రామారావు మాట్లాడుతూ దగ్గు ఉన్న ప్రతి రోగికి గళ్ళ పరీక్షలు నిర్వహించి ఫాల్లోప్ చేయాలని అన్నారు. స్టేట్ ర్.బి.స్.కె.కార్యక్రమ అధికారి మాట్లాడుతూ రెండవ విడత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.శిక్షణ పొందిన వైద్యులు కు ధ్రువపత్రాలు అందచేశారు ఈకార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ.డాక్టర్ రామ గిడ్డయ్య,పి.ఓ.డి.టి.టి.డాక్టర్ రామా దేవి,డెమో డాక్టర్ నిర్మలమ్మ, స్.ఓ.రమేష్ రెడ్డి,డాక్టర్ సుదర్శన, డిప్యూటీ డెమో శాంతమ్మ,రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon