• Neti Charithra

ఎద్దుల పోటీలకు.. జోష్ .. పెంచిన సీఎం జగన్ !

ఎద్దుల పోటీలకు జోష్ .. పెంచిన సీఎం జగన్ !

గుడివాడ: నేటి చరిత్ర (జనవరి14)

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) గుడివాడలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లింగవరం రోడ్‌ కే కన్వెన్షన్‌లో ఈ వేడుకలు జరుగుతున్నాయి.

ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌.. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అలాగే ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకించారు. జాతీయ ఎడ్ల పోటీలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

31 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon