- Neti Charithra
ఎక్సైజ్ పోలీసుల పై సారా తయారీ నిర్వాహకుల దాడి.. సి ఐ తో పాటు ఇద్దరు పోలీసులకు గాయాలు !

ఎక్సైజ్ పోలీసుల పై సారా తయారీ నిర్వాహకుల దాడి.. సి ఐ తో పాటు ఇద్దరు పోలీసులకు గాయాలు !
మహబూబ్ నగర్: నేటి చరిత్ర
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ గ్రామపంచాయతీ పరిధి ఒంటిగుడిసె తండాలో నాటుసారా తయారీ చేస్తోన్న స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. దీంతో ఆ తండా వాసులు ఒక్కసారిగా ఎక్సైజ్ పోలీసులపై తిరగబడి దాడి చేశారు. తండావాసులు చేసిన దాడిలో ఎక్సైజ్ సీఐ బాలాజీ, ఇద్దరు కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ సిబ్బందిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు.

143 views0 comments