• Neti Charithra

ఊటీ లో పర్యాటకుల పై రైల్వేశాఖ కీలక ఆంక్షలు !

#ఊటీ లో పర్యాటకుల పై రైల్వేశాఖ కీలక ఆంక్షలు !

ఊటీ: నేటి చరిత్ర (ఆగస్టు25) ఊటీ పర్వతాల్లోని రైలు పట్టాలపై సెల్ఫీ తీసుకొంటే రూ.2 వేలు జరిమానా విధిస్తామని దక్షిణ రైల్వే ప్రకటించింది. పర్యాటక ప్రాంతమైన ఊటీకీ విదేశాల నుంచి సైతం పర్యాటకులు వస్తుంటారు. ఎక్కువ మంది పర్వత ప్రాంతంలో రైల్లో ప్రయాణించి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతారు. రైల్లో ప్రయాణిస్తూ జలపాతాలు, లోయలు వచ్చినప్పుడు ప్రయాణికులు ప్రమాదకరంగా వేలాడుతూ సెల్ఫీలు తీసుకొంటున్నారు. రైలు నెమ్మదిగా వెళ్లే సమయంలో అమితాసక్తితో ఇంజిన్‌ ముందు నిలబడి, రైలు పట్టాలపై పడుకొని సెల్ఫీలు తీస్తున్నారు. ఇలా సెల్ఫీ తీసుకొంటే రూ.2 వేలు జరిమానా, టిక్కెట్టు లేకుండా ప్లాట్‌ఫారంపై ఉంటే రూ.1000, టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తే రూ.1000, రైల్వేస్టేషన్‌, పట్టాలపై వ్యర్థాలు వేస్తే రూ.200, అపరిశుభ్రం చేస్తే రూ.300 జరిమానా విధిస్తామని అధికారులు పేర్కొన్నారు.

16 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon