• Neti Charithra

ఉల్లి ఎగుమతుల పై నిషేధం ప్రకటించిన కేంద్రం!

#ఉల్లి ఎగుమతుల పై నిషేధం ప్రకటించిన కేంద్రం!

న్యూఢిల్లీః నేటి చరిత్ర (సెప్టెంబర్29) దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కళ్లనీళ్లు తెప్పిస్తున్నాయి. పలు రాష్ట్రా ల్లో కిలో ఉల్లి ధర రూ.80 వరకు పలుకుతోంది. పైగా నాణ్యత కూడా నాసిరకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, కేంద్రం కాస్త కటువైన నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాము చెప్పేవరకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయాలని కేంద్రం పేర్కొంది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. వ్యాపారులు కావాలనే ఉల్లి నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని కేంద్రం భావిస్తోంది. ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు తామే ఉల్లిని తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తున్నాయి. ఢిల్లీలో కిలో రూ.25, పంజాబ్ లో కిలో రూ.35 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కొక్కరికి 2 కిలోలు మాత్రమే అమ్ముతున్నారు.

2 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon