- Neti Charithra
ఉలిక్కి..పడ్డ చిత్తూరుజిల్లా.. అంగళ్ళు.. రిలీఫ్ సెంటర్ లో 11 మందికి పాజిటివ్ !

ఉలిక్కి..పడ్డ చిత్తూరు జిల్లా.. అంగళ్ళు రిలీఫ్ సెంటర్ లో 11 మందికి పాజిటివ్ !
కురబలకోట: నేటి చరిత్ర
చిత్తూరుజిల్లా లో తాజాగా 11 కరోనా... పాజిటివ్ కేసులు నమోదు కావటం కల కలం .. రేపుతోంది. చిత్తూరుజిల్లా కు సంబంధించిన పలువురు ఇటీవల
రాజస్థాన్ లోని అజ్మీర్ యాత్రలకు వెళ్లి లాక్ డౌన్ లో చిక్కు కున్నారు. వారిని 5 రోజుల క్రితం ప్రభుత్వం 77 మంది ని
చిత్తూరుజిల్లా కు ప్రత్యేక వాహనాల లో రప్పించారు. వీరిని కురబలకోట గోల్డన్ వ్యాలీ రిలీఫ్ సెంటర్ లో ఉంచి ప్రభుత్వం కరోనా టెస్ట్ పరీక్షలు నిర్వహించారు. వీటి రిపోర్టులు గురువారం సాయంత్రం అందడం తో వీరిలో 11 మందికి కరోనా పాజిటివ్ రావటం తో జిల్లా ప్రజలు హులిక్కి పడ్డారు. వీరిని ప్రత్యేక వాహనాలు లో అధికారులు జిల్లా కేంద్రానికి తరలించే చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్ వచ్చిన వారి లో చిత్తూరు పరిసరాలకు చెందిన వారుగా సమాచారం.
