- Neti Charithra
ఉర్దూ ఫ్రీ ప్రైమరీ తరగతులను ప్రభుత్వం.. నిర్వహించాలి- రూటా రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఖాన్ !

ఉర్దూ ఫ్రీ ప్రైమరీ తరగతులను ప్రభుత్వం.. నిర్వహించాలి- రూటా రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఖాన్ !
మదనపల్లె: నేటి చరిత్ర
రాష్ట్రంలోని అన్ని ఉర్దూ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అనుబంధం గా ఉర్డు ప్రీ ప్రైమరీ తరగతులను వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించాలని రూటా రాష్ట్ర కార్యదర్శి పఠాన్ ముహమ్మద్ ఖాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరుజిల్లా

మదనపల్లె లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉర్దూ పాఠశాలల లో యల్.కె.జీ యూ.కే.జీ ప్రారంభించడం వలన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల బాట పట్టకుండా ఉచితమైన, నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుకోగలరని దీంతో ప్రాథమిక పాఠశాలలలో గణనీయంగా విద్యార్థుల నమోదు జరుగుతుందని

అన్నారు... ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి యస్ బి అంజాద్ భాష , విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ,విద్యా శాఖ కమిషనర్ చిన్న వీరభద్రుడు లకు ప్రాతినిధ్యం చేసి నట్టు ఆయన తెలిపారు....