- Neti Charithra
ఉద్యోగం.. లో చేరిన మూడు మాసాలకే .. లంచం తీసుకుంటూ ..ఏసీబీ కి చిక్కిన రెవిన్యూ అధికారి!

#ఉద్యోగం.. లో చేరిన మూడు మాసాలకే .. లంచం తీసుకుంటూ ..ఏసీబీ కి చిక్కిన రెవిన్యూ అధికారి!
తుర్కయాంజాల్: నేటి చరిత్ర (అక్టోబర్4) బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే ఓ గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన సంఘటన తెలంగాణా లో సంచలనం కలిగించింది. సరూర్నగర్ మండలం గుర్రంగూడకు చెందిన రైతు జక్కిడి ముత్యంరెడ్డి అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయాంజాల్ రెవెన్యూ పరిధిలో 1.29 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిని తన పేరుపై మ్యుటేషన్ చేయాలని దరఖాస్తు చేసుకోగా తుర్కయాంజాల్ వీఆర్వో శంకర్ రూ.లక్ష డిమాండ్ చేశారు. చివరకు రూ.75 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని రైతు.. అనిశా దృష్టికి తీసుకెళ్లారు. అనిశా అధికారుల సూచన మేరకు గురువారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కమ్మగూడ గ్రామ రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వోకు రూ.50 వేలు ఇస్తుండగా అనిశా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కార్యాలయంలో పలు పత్రాలను స్వాధీనం చేసుకొని, మండల తహసీల్దారు విజయ నుంచి వివరాలను సేకరించారు. నిందితుణ్ని అరెస్టు చేసి అనిశా కోర్టులో ప్రవేశపెట్టేందుకు తరలించారు. పట్టుబడిన వీఆర్వో ఈ ఏడాది జులైలోనే నియమితులవడం గమనార్హం.
