• Neti Charithra

ఉద్యోగాలకు ఏడుగురు మిట్స్ విద్యార్థులు ఎంపిక!

#ఉద్యోగాలకు ఏడుగురు మిట్స్ విద్యార్థులు ఎంపిక!

మదనపల్లె: నేటి చరిత్ర (సెప్టెంబర్22) మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి (మిట్స్) కళాశాల నందు బి.టెక్ చివరి సంవత్సరము చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో 7 మంది విద్యార్థులు కు ఉద్యోగాలు లభించాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. 2020 లో బి.టెక్ పూర్తి చేసుకొనే విద్యార్థులకు ఎడ్యుపాలిస్ టెక్నాలజీస్ (unschool.in) వారు నిర్వహించిన ఈ ప్రాంగణ ఎంపికలలో ప్రతిభ కనపరిచిన 7 మంది విద్యార్థులకు ఉద్యోగం లభించిందని, వీరికి సంవత్సరానికి 5 లక్షల సాలరీ అని అన్నారు. 5 మంది ఈ.సి.ఈ విద్యార్థులు మరియు సి.ఎస్.ఈ మరియు సివిల్ నుండి ఒక్కొక్క విద్యార్ధి చెప్పున ఎంపిక అయినట్లు ఆయన అన్నారు. లాలస, కార్తీక్, సంకల్ప్ మిశ్రా, తన్మయీ, పవిత్ర, మురళి మరియు చందన లు ఎంపిక అయిన విద్యార్థులలో ఉన్నారని ఆయన అన్నారు. గ్రూప్ డిస్కషన్ తో మొదలై టెక్నికల్ మరియు హెచ్.ఆర్ రౌండ్ లుగా మూడు రౌండ్లలో ఈ విద్యార్థులు ప్రతిభ కనపరిచారని, ఉద్యోగాలకు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్. సి. యువరాజ్, సీనియర్ ప్లేసెమెంట్ ఆఫీసర్ శర్వాన్ బాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.

0 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon