• Neti Charithra

ఉత్తమ విద్యార్థుల అభినందన సభ ను విజయవంతం చేయండి !!

#ఉత్తమ విద్యార్థుల అభినందన సభ ను విజయవంతం చేయండి !

విజయవాడ: నేటి చరిత్ర( అక్టోబర్28) విజయవాడ సిద్దార్థ కాలేజీ ఆడిటోరియం లో ఈనెల 30 న ప్రజా నేస్తం ఆధ్వర్యంలో జరిగే ఉత్తమ విద్యార్థుల అభినందన సభ ను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి. గౌతమ్ రెడ్డి, ప్రజా నేస్తం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. రాజారెడ్డి లు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ పేరుతో అవార్డ్ ప్రధానం చేయడం గర్వించ దగ్గ విషయమని అన్నారు. కోట్లాది రూపాయల చిన్న పాటి పదవి వస్తేనే సంపాదించుకొనే నేటి పరిస్థితులలో రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగినా ఏ మాత్రం డబ్బు కోసం కాకుండా సమాజం కోసం పాటుపడిన మహా మనిషి నని అన్నారు. ప్రజా నేస్తం అధ్యక్షుడు ఎన్. రాజారెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆదర్శాలను నేటి యువతకు తెలిపేందుకు ఈ కార్యక్రమం నని అన్నారు. విజయవాడ నగరంలో నీ ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు లో నీ మెరిట్ విద్యార్థులకు అబ్దుల్ కలామ్ పేరుతో అవార్డ్ ప్రధానం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గౌతమ్ రెడ్డి, వి వి కృష్ణారావు, డాక్టర్ నరహరి వర ప్రసాద్, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్ర శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దామోదర్, సతీష్, నవీన్, విజయ్, పాల్గొన్నారు.

22 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon