- Neti Charithra
ఉగ్రవాదుల దాడుల్లో ముగ్గురు జవాన్ లు మృతి..!
ఉగ్రవాదుల దాడుల్లో ముగ్గురు జవాన్ లు మృతి..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు, ఒక పోలీసు మృతి చెందారు. సిఆర్పిఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులతో కూడిన ఉమ్మడి బృందం క్రీరి వద్ద ఉన్న చెక్‌పోస్టు వద్దకు విధుల్లో
భాగంగా ఉన్నారు. అక్కడే ఉన్న ఉగ్రవాదులు ఒక్కసారిగా వీరిపై కాల్పులు జరిపాడు. తిరిగి భద్రతా దళాలు కాల్పులు జరిపేలోపు ఉగ్రవాదులు తప్పించుకొని
పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. అగస్టు 14వ తేదీన నౌగామ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా ఒకరు గాయపడ్డారు.
187 views0 comments