- Neti Charithra
ఈ సారి.. భక్తులు లేకుండా బ్రహ్మోత్సవాలు తో పాటు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలక మండలి..!
ఈ సారి.. భక్తులు లేకుండా బ్రహ్మోత్సవాలు తో పాటు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలక మండలి..!
తిరుమల: నేటి చరిత్ర
టీటీడీ పాలక మండలి సమావేశం లో సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సారి భక్తులు లేకుండానే బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. టీటీడీ అధ్యక్షులు
సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం లోవిజయవాడ సమీపంలోని పోరంకిలో టీటీడీ కల్యాణ మండపాన్ని నిర్మించడానికి అంగీకరించారు. తిరుమలలోని చెత్తను కంపోస్ట్‌గా మార్చి రైతులకు ఇచ్చే అంశంపైనా చర్చ జరిగింది. కొండ మీద టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయిందని దాన్ని వెంటనే తరలించాలని తీర్మానించారు.
మరోవైపు టీటీడీ బోర్డ్ మీటింగ్‌లో శ్రీవారి బంగారు నగల డిపాజిట్లపై చర్చ జరిగింది. ప్రస్తుతం నగలను బ్యాంకుల్లో షార్ట్ టర్మ్ డిపాజిట్ చేశారని, దీనివల్ల తక్కువ వడ్డీ వస్తోందన్నారు టీటీడీ బోర్డ్ సభ్యులు
జూపల్లి రామేశ్వరరావు. అలా కాకుండా లాంగ్ టర్మ్ డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ వడ్డీ వస్తుందని సూచించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. రామేశ్వరరావు సూచనలను అభినందించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. జూపల్లి రామేశ్వరరావు సూచనలు టీటీడీ అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతాయని ఛైర్మెన్ కొనియాడారు. ఆయన సూచించిన సూచనలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. వెంటనే శ్రీవారి నగలన్నీ 12 ఏళ్ల లాంగ్ టర్మ్ డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు.