• Neti Charithra

ఈ ఎస్ ఐ ఆసుపత్రి లో కోవిద్ సేవలకు ముమ్మర ఏర్పాట్లు- జేసీ వీర బ్రహ్మం!


ఈ ఎస్ ఐ ఆసుపత్రి లో కోవిద్ సేవలకు ముమ్మర ఏర్పాట్లు- జేసీ వీర బ్రహ్మం!



తిరుపతి: నేటి చరిత్ర


తిరుపతి నగరం లోనిఆర్. సి. రోడ్డులోని కార్మిక రాజ్య బీమా (ఈ. ఎస్. ఐ ఆసుపత్రి)ఆసుపత్రిలో ఈనెల 15 వ తేదీ నుండి కోవిడ్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)వి. వీర బ్రహ్మయ్య తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్. భరత్ గుప్తా ఆదేశాల మేరకు తిరుపతి ఈ. ఎస్. ఐ ఆసుపత్రిలో జిల్లా ఉన్నతాధికారులు, డాక్టర్ల తో సమావేశం నిర్వహించారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా ఉన్న ఈ. ఎస్. ఐ ఆసుపత్రిలో

న్యాయ శాఖ లో పనిచేస్తున్న వారికి కోవిడ్ సేవలు అందించేందుకు కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే డాక్టర్లు వంటి ప్రత్యేక మైన వారికోసం కోవిడ్ వైద్య సేవలు అందించేందుకు తిరుపతి ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA)శాఖ ముందుకు రావడంతో తిరుపతి ఈ. ఎస్. ఐ ఆసుపత్రిలో సదుపాయాలు, కావలసిన ఏర్పాట్లు వంటి వాటిపై అధికారులతో చర్చించారు. ఆక్సిజన్ సీలిండర్లు, లాబరేటరీ వంటి మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన డాక్టర్లను,సిబ్బందిని రుయా,జిల్లా ఆసుపత్రిల నుండి కొంత మంది, IMA నుండి కొంతమందిని తెచ్చుకొనే విదంగా సమన్వయం చేసుకోవాలని ఈ. ఎస్. ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. కె. బాలశంకర్ రెడ్డికి సూచించారు.ఈ నెల 15 వ తేదీకల్లా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.ప్రాథమికంగా సాధారణ, మధ్య స్థాయి కోవిడ్ కేసులకు సేవలు అందించాలని, అత్యవసర మైన వాటిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మయ్య సూచించారు.అలాగే

ఆసుపత్రిలో అన్ని వార్డుల్లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారులు డి. ఎం. హెచ్. ఒ.డాక్టర్ పెంచలయ్య, డి. సి. హెచ్. ఎస్.డాక్టర్. సరళమ్మ,ఈ. ఎస్. ఐ. కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ రమణారెడ్డి(PO, SSA),ఈ. ఎస్. ఐ, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్లు డాక్టర్. కె. బాల శంకర్ రెడ్డి, డాక్టర్. భారతి,ఈ. ఎస్. ఐ ఆర్. ఎం. ఓ. డాక్టర్ వై. కల్పలత, తిరుపతి ఐ. ఎం.

ఎ(IMA) శాఖ ప్రతినిధులు డాక్టర్లు. కృష్ణ ప్రశాంతి, శ్రీ హరి రావు, మదన్, యుగంధర్ తో పాటు స్విమ్స్, మెటిర్నిటీ,తుడా ,మున్సిపల్,APMISDC, ఆరోగ్య శ్రీ సంస్థల ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు. అనంతరం స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రి నోడల్ ఆఫీసర్(పీడీ,DWMA)

చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఈ. ఎస్. ఐ ఆసుపత్రి డాక్టర్లు, నర్సింగ్, హౌస్ కీపింగ్ సిబ్బందికి కోవిడ్ రోగుల విషయంలో అందిచాల్సిన సేవలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలపై స్విమ్స్ డాక్టర్ తో అవగాహన కల్పించారు.

105 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon