- Neti Charithra
ఈతకు వెళ్లిన..ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి గల్లంతు..మదనపల్లె లో ఘటన..!
Updated: Jul 25, 2020
ఈతకు వెళ్లిన..ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి గల్లంతు..మదనపల్లె లో ఘటన..!
మదనపల్లె: నేటి చరిత్ర
( నీటి లో గల్లంతు ఆయిన విద్యార్థి మణికంఠ) ఫైల్ ఫోటో
చిత్తూరు జిల్లా మదనపల్లె లో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. మదనపల్లె బైపాస్ రోడ్ ఆర్టీవో కార్యాలయం సమీపం లో నీటి కుంట లో ఈత ఆడేందుకు వెళ్లిన ముగ్గురు
యువకుల్లో ఓ యువకుడు గల్లంతు అయ్యాడు.సమీపం లోని కొండయ్యగారిపల్లె కు చెందిన కరోన పాజిటివ్ తో తిరుపతి లో చికిత్స
పొందుతున్న వ్యక్తి కుమారుడు చెరువు లో గల్లంతు అయిన విద్యార్థిమణికంఠ గా పోలీసులు గుర్తించారు. ఈ యువకుడు అంగళ్ళు లోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కావడం గమనార్హం. ఈ ప్రమాదం కుటుంబ సభ్యుల్లో కల కలం రేపింది.ప్రమాద స్థలాన్ని తాలుకా పోలీసులు పరిశీలించారు. గల్లంతు అయిన విద్యార్థి కోసం.. అగ్నిమాక సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.