• Neti Charithra

ఈతకు వెళ్లిన ఇద్దరు పిల్లలు.. మృతి..చిత్తూరు జిల్లా లో విషాదం..!


ఈతకు వెళ్లిన ఇద్దరు పిల్లలు.. మృతి..చిత్తూరు జిల్లా లో విషాదం..!




వి కోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లావి.కోట మండల పరిధిలోని యాలకల్లు పంచాయతీ కప్పట్ల బండ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఈతకెళ్ళి కిరణ్ (7 ), మంజునాథ్ ( 7) అనే పిల్లలు మృత్యువాత పడ్డారు. గత రెండు రోజులుగా కురిసిన వానకు బావుల్లో నీరు వచ్చాయి. దీంతో పిల్లలు ఆటలాడుతూ బావి వద్దకు వెళ్ళారు. నారాయణప్పకు చెందిన వ్యవసాయ బావిలో ఈతకు

దిగారు. బావిలో పూడు ఉండటంతొ ఇద్దరు పిల్లలు ఇరుక్కు పోయ్యారు. వారు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన వీరితో పాటు వెళ్ళిన మరిొ బాలుడు గడ్డపై నుండీ పరుగున వెళ్ళి గ్రామస్తులకు తెలిపారు. దీంతో బావి వద్దకు చేరుకుని పరిశీలించగా పిల్లలు బావిలో మృతి చెంది ఉన్నారు. మృతులు 1. కిరణ్ (7) s/o రమేష్.. 2. మంజు (7) s/o రఘురాం.. ఇద్దరు అన్న దమ్ముల కుమారులు. పోలిసులకు సమాచారం ఇవ్వకుండా పిల్లలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది.


302 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon