- Neti Charithra
ఈడి.. కేసులో జగన్ కు చుక్కెదురు !

ఈ డి కేసులో జగన్ కు చుక్కెదురు !
హైదరాబాదు: నేటి చరిత్ర (జనవరి24)
అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్కు మళ్లీ చుక్కెదురైంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు న్యాయస్థానం నిరాకరించింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేందుకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపును న్యాయస్థానం తిరస్కరించగా.. తాజాగా ఈడీ కేసుల్లో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. అక్రమాస్తుల కేసుల్లో ఈడీ దాఖలు చేసిన ఐదు ఛార్జిషీట్లలోనూ జగన్ మొదటి నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుల్లో తనకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ అభ్యర్థనపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితుల హాజరు తప్పనిసరని.. అన్ని కేసుల విచారణకూ జగన్ స్వయంగా హాజరు కావాలని ఈడీ వాదించింది. ఈ పిటిషన్పై ఇటీవలే వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. జగన్ దాఖలు చేసిన వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ను కొట్టివేసింది. అయితే ఈరోజు జరిగిన విచారణ నుంచి జగన్కు ముందే మినహాయింపు లభించడంతో ఆయన హాజరుకాలేదు
