- Neti Charithra
ఇంట్లో.. షార్ట్ సర్క్యూట్.. అర్ధరాత్రి మహిళ సజీవ దహనం!

ఇంట్లో.. షార్ట్ సర్క్యూట్.. అర్ధరాత్రి మహిళ సజీవ దహనం!
వరంగల్: నేటి చరిత్ర
వరంగల్ జిల్లాలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఒంటరి మహిళ అగ్ని ప్రమాదంలో సజీవ దహనం కావటం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది.

పోలీసుల కథనం మేరకు.. గోదావరి ఖని పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన భోనాల అనసూర్య(55) భర్త చంద్రయ్య రెండేళ్ల కిందట మృతి చెందాడు. ఆయనకు రెండో భార్య అయిన అనసూర్యకు పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల పక్షవాతం బారిన పడటంతో జీవనం మరింత దుర్భరంగా మారింది.

రేషన్ బియ్యంతో ఆమె కాలం వెళ్లదీస్తోంది. సోమవారం అర్ధరాత్రి అనసూర్య నివసిస్తున్న గుడిసెకు
విద్యుదాఘాతంతో నిప్పంటుకుంది. వెంటనే మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఆమె ప్రాణాలను కాపాడుకోవడానికి పాకుకుంటూ గుమ్మం వద్దకు వచ్చినా ఫలితం లేకపోయింది. పూర్తిగా మంటలు అంటుకోవడంతో సజీవ దహనమైంది.
109 views0 comments