- Neti Charithra
ఇంటికి కన్నం.. వేస్తూ పట్టు పడిన ఎస్ ఐ.. కి మూడేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం !

#ఇంటికి కన్నం.. వేస్తూ పట్టు పడిన ఎస్ ఐ.. కి మూడేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం !
హైదరాబాదు: నేటి చరిత్ర (అక్టోబర్1) తెలంగాణ లో ఓ ఇంట్లోకి చోరీకి యత్నించిన ఓ పోలీసు అధికారికి న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గుర్రంగూడ నివాసి మహేందర్‌రెడ్డి హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ విభాగంలో సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సమీపంలోని అల్మాస్‌గూడలో నివసించే మిట్టపల్లి శివప్రసాద్ 2016 అక్టోబరు 9న ఇంటికి తాళం వేసి సొంతూరు వెళ్లారు. గమనించిన మహేందర్‌రెడ్డి చోరీ చేయడానికి శివప్రసాద్ ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి లోనికి చొరబడ్డాడు. అదే రోజు అర్ధరాత్రి శివప్రసాద్ తిరిగి ఇంటికొచ్చి తాళం తీసి లోనికెళ్లగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానంతో ఇంటిచుట్టూ కలియచూడగా మహేందర్‌రెడ్డి మెట్ల దగ్గర కనిపించాడు. వెంటనే అతన్ని పోలీసులకు అప్పజెప్పారు. ఈ మేరకు మీర్‌పేట పోలీసులు మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. అనంతరం సమగ్ర ఆధారాలతో కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. విచారించిన సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి.కవితాదేవి సోమవారం తుది తీర్పు వెలువరించారు.
