• Neti Charithra

ఇంటర్ విద్యా సంవత్సరానికి.. క్యాలెండర్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు..!


ఇంటర్ విద్యా సంవత్సరానికి.. క్యాలెండర్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


రాష్ట్రంలో విద్యా సంవత్సరాన్ని తెలంగాణ ఇంటర్‌బోర్డు గురువారం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

దసరాకు ఆదివారంతో కలిపి మూడు రోజులే సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 23 నుంచి 25 వరకు జూనియర్‌ కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు బోర్డు పేర్కొంది. జనవరి 13, 14 సంక్రాంతి సెలవులు కాగా.. ఫిబ్రవరి 22 నుంచి 27 వరకు ఇంటర్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు

నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 1 నుంచి మార్చి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.  మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12 వరకు ఇంటర్‌ వార్షిక పరీక్షలు.. ఏప్రిల్‌ 17 నుంచి మే 31 వరకు ఇంటర్‌ కళాశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. 


428 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon