- Neti Charithra
ఇంటర్ విద్యార్థి కి రైలు లోంచి తోసేశాడు.. అనంతపురం లో దారుణం!

అనంతపురం: నేటి చరిత్ర (ఆగస్టు27) రైల్లోంచి ఇంటర్ విద్యార్థిని గుర్తుతెలియని ప్రయాణికుడు కిందకు తోసేశాడు. ఈ ఘటనలో విద్యార్థి రెండు కాళ్లు కోల్పోయాడు. అనంతపురం జిల్లా జక్కలచెరువు రైల్వే స్టేషన్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. జీఆర్పీ పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన మైన్స్ వ్యాపారి రాజేశ్వరరెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు నిరంజన్‌రెడ్డి విజయవాడలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ సెకడియర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులను చూడాలని విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైల్లో తాడిపత్రికి బయల్దేరాడు. గాఢ నిద్రలో ఉండటంతో తాడిపత్రిలో దిగలేదు. జక్కల చెరువు రైల్వే స్టేషన్లో రైలు వెళ్తున్న సమయంలో లేచి ఏ ఊరో తెలుసుకోవాలని డోర్ దగ్గరకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కిందకు తోసేశాడు.