- Neti Charithra
ఇంటర్ లో మార్కులు తక్కువగా వచ్చాయని.. విద్యార్థిని ఆత్మహత్య!

ఇంటర్ లో మార్కులు తక్కువగా వచ్చాయని.. విద్యార్థిని ఆత్మహత్య!
నంద్యాల: నేటి చరిత్ర
కర్నూలుజిల్లాలోని నంద్యాల మండలం అయ్యలూరులో దారుణం జరిగింది . నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థిని హరిప్రియ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఇంటర్లో సరైన మార్కులు రాలేదని మనస్తాపానికి గురైన హరిప్రియ పురుగుల మందు తాగి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కర్నూలు నారాయణ కాలేజ్‌కి చెందిన విద్యార్థిని. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

236 views0 comments