- Neti Charithra
ఇంజనీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల సమస్యలు ను పరిష్కరించండి!

#ఇంజనీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల సమస్యలు ను పరిష్కరించండి!
అమరావతి: నేటి చరిత్ర (డిసెంబర్3) ఏపీ లోని ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాల ల లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ టెక్నీకల్ మరియు ప్రొఫెషనల్ ఇనిస్టుషన్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి కోరారు. ఆయన అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చెర్మన్ డాక్టర్ హేమచంద్ర రెడ్డి దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల ఒరిజనల్ సర్టిఫికెట్లు ను పలు కళాశాలల యజమానులు నిబంధనలకు వ్యతిరేకంగా తమ వద్దే ఉంచుకోవటంతో ఎదురవుతున్న సమస్యలను చెర్మన్ హేమచంద్రారెడ్డి దృష్టికి తెచ్చారు. అలాగే మరికొన్ని కళాశాలల యాజమాన్యాలు అధ్యపకులకు జీత భత్యాలు సరిగా ఇవ్వని కారణం గా ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా బ్రహ్మానంద రెడ్డి ఆయన దృష్టికి తెచ్చారు.
