• Neti Charithra

ఇసుక వారోత్సవాలు కాదు... కార్మికుల కష్టాలు తీర్చండి- చంద్రబాబు నాయుడు

#ఇసుక వారోత్సవాలు కాదు... కార్మికుల కష్టాలు తీర్చండి- చంద్రబాబు నాయుడు

అమరావతి : నేటి చరిత్ర (అక్టోబర్30) వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకుల్లో ఊరికో ఇసుకాసురుడు ఆవిర్భవించారని, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ముందు వారి భరతం పట్టి ఆ తర్వాత ఉత్సవాలు నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. బుధవారం ఉదయం టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇసుక నియంత్రణ పేరుతో వైసిపి నాయకులు తమ జేబులను నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. సొంత ఊరిని ఆనుకుని ప్రవహిస్తున్న వాగు నుంచి ఇసుక తీసుకు వెళ్లాలన్నా అనుమతులు ఏమిటని ప్రశ్నించారు. ఇసుక కొరత కారణంగా ఆరుగురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, దానిపై మాట్లాడకుండా వారోత్సవాలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటన్నారు. చావు బాజా మోగించాక వారోత్సవాలు ఏమిటని ఎద్దేవా చేశారు. తెలంగాణలో లేని ఇసుక కొరత ఎపి లోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పనులు కోల్పోయిన కార్మికులకు పరిహారం చెల్లించడంతోపాటు కార్మిక సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon