- Neti Charithra
ఇసుక విధానం పై.. ఆర్డినెన్స్- సీఎం జగన్
ఇసుక విధానం పై.. ఆర్డినెన్స్- సీఎం జగన్

#ఇసుక విధానం పై.. ఆర్డినెన్స్- సీఎం జగన్
అమరావతి : నేటి చరిత్ర (నవంబర్6) ఇసుక మాఫియా, స్మగ్లింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇసుక విధానంపై సిఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారిగా ధలను నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పోలీసు, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
19 views0 comments