• Neti Charithra

ఇసుక, అక్రమ మద్యం రవాణా చేసేవారి పై ఉక్కుపాదం- చిత్తూరు ఏఎస్పీ రిషాంత్ రెడ్డి!


ఇసుక, అక్రమ మద్యం రవాణా చేసేవారి పై ఉక్కుపాదం- చిత్తూరు ఏఎస్పీ రిషాంత్ రెడ్డి!




పిటిఎం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో ఆక్రమంగా ఇసుక, ఇతర రాష్ట్రాల మద్యం రవాణా , నాటు సారా తయారీ దారుల పై ఉక్కుపాదం మోపనున్నట్లు చిత్తూరు ఏఎస్పీ రిషాంత్ రెడ్డి హెచ్చరించారు.ఇలాంటి వారిపై అవసరం అయితే పీడీ యాక్టు లకు ప్రతి పాదిస్తామని ఆయన హెచ్చరించారు.

కర్ణాటక సరిహద్దు లోని పిటిఎం , ములకలచేరువు మండలాల్లో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పిటిఎం లో మీడియాతో మాట్లాడుతూ జిల్లా సరిహద్దు లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు లు ఉండటం తో కొందరు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక చెక్ పోస్టులతో నిఘా ను ముమ్మరం చేశామని, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమం గా మద్యం రవాణా కాకుండా అన్ని చర్యలు

తీసుకుంటున్నామన్నారు. మరో వైపు జిల్లా లో నాటు సారా తయారీ ని కట్టడి చేసేందుకు ముమ్మర దాడులు చేస్తున్నామన్నారు.

పిటిఎం పోలీసులు గురువారం పట్టుకున్న కర్ణాటక మద్యాన్ని ఆయన పరిశీలించారు.

ఇసుక, మద్యం అక్రమ రవాణా కానీ నాటుసారా తయారీ, నిల్వల పై

సెల్ 9440900004 కు సమాచారం ఇవ్వాలన్నారు.

ఆయన వెంట మదనపల్లె డిఎస్పీ రవిమనోహర చారి, ఈ ఎస్ ఐ సీఐ లు మల్లీ క, బాబు ,ప్రసాద్ పిటిఎం ఎస్ ఐ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


290 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon