- Neti Charithra
ఇద్దరు యువతులు.. ఆత్మహత్య !

ఇద్దరు యువతులు ఆత్మహత్య !
హైదరాబాదు : నేటి చరిత్ర (ఫిబ్రవరి7)
హయత్‌నగర్‌లోని శ్రీనివాసపురం కాలనీలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు యువతులు ఒకేసారి, ఒకే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాలడ్డారు. తల్లిదండ్రులకు భారం కాకూడదనే ప్రాణాలు తీసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో యువతులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు.. మహబూబాబాద్ జిల్లా పోతునపల్లికి చెందిన మమత కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులతో నగరానికి వచ్చింది. వారి కుంటుంబం హయత్‌నగర్‌లోని శ్రీనివాసపురం కాలనీలో నివాసముంటోంది. ఆమె ఇంటర్ పూర్తి చేసింది.

ఇక అదే కాలనీలో గౌతమి అనే యువతి.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. వారిది కర్నూలు జిల్లా మాధవరం మండలం వెలుగోడు. మమత, గౌతమి ఇళ్లు పక్కపక్కనే కావడంతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మమత తల్లిదండ్రులు మహబూబ్‌నగర్‌లో గత బుధవారం ఓ వివాహ వేడుకకు వెళ్లగా.. ఈరోజు ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.