- Neti Charithra
ఇద్దరు దొంగలు అరెస్ట్.. భారీగా బంగారం స్వాధీనం

కడప : నేటి చరిత్ర(ఆగస్టు23) కడప నగరంలో పలుచోట్ల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని కడప డిఎస్పి సూర్య నారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి సూర్యనారాయణ మాట్లాడుతూ... నగరంలోని శంకరాపురం భారతి భారత్ స్ట్రీట్ లో నివాసముంటున్న మంచ వంశీకఅష్ణ, మంచ వెంకటేష్ లు కంసాలి వఅత్తి చేసుకుంటూ, మరోవైపు పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ నెల 22 వ తేదీన దొంగతనాలను చేధించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బఅందాన్ని చూసిన దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారని చెప్పారు. నగరంలోని మాచిపల్లి రోడ్డు వద్ద విజ్ఞాన డిగ్రీ కాలేజీ ముందు భాగంలో మెయిన్ రోడ్డు పై నిలబడి ఉన్న ముద్దాయిలు అక్కడే నిలుచున్న పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారన్నారు. వారిని విచారించగా నగరంలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు ముద్దాయిలు అంగీకరించారన్నారు. వారి వద్ద నుండి మొత్తం 107 గ్రాముల వివిధ రకాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాత్రి వేళలో కిటికీలు తెరచుకుని పడుకున్న ఇళ్లను గుర్తించి ఇళ్లలో ఏవైనా విలువైన వస్తువులు, ఆభరణాలు కనిపిస్తే వాటిని సన్నని కర్ర సహాయంతో గుట్టుచప్పుడు కాకుండా దొంగిలిస్తున్నారని వివరించారు. నిందితుడు వంశీకఅష్ణ దొంగతనాలకు పాల్పడి తెచ్చిన ఆభరణాలను అన్న వెంకటేష్ సొమ్ములను కరిగించి వివిధ ప్రాంతాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. వంశీకఅష్ణ పై ఇదివరకే మూడు కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ప్రజలు పడుకునే ముందు కిటికీలను తెరిచి ఉంచొద్దని, కిటికీల దగ్గరలో విలువైన వస్తువులను, ఆభరణాలను ఉంచవద్దని డీఎస్పీ సూర్య నారాయణ సూచించారు. నిందితులను పట్టుకోవడంలో కఅషి చేసిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో చిన్నచౌకు సీఐ కె.అశోక్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్ లు నరేంద్ర, శేఖర్, దస్తగిరి, రాజశేఖర్ రెడ్డి, సిపివో లు పాల్గన్నారు.