• Neti Charithra

ఇద్దరు డీఎస్ పి ల పై.. కేసులు ఎత్తేసిన..ఏపీ ప్రభుత్వం...!


ఇద్దరు డీఎస్ పి ల పై.. కేసులు ఎత్తేసిన..ఏపీ ప్రభుత్వం...!




అమరావతి: నేటి చరిత్ర


కర్నూలు నిఘా విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న జి.వెంకటరాముడిపై విధించిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఆయన నెల్లూరు పట్టణ డీఎస్పీగా పనిచేసే సమయంలో ఓ వరకట్న మృతి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనేది అభియోగం. ఆయనపై విధించిన చర్యలను ఎత్తేసి.. విధి

నిర్వహణలో భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అలాగే బాపట్ల డీఎస్పీగా పనిచేసే సమయంలో ఎన్‌.రాజ్‌కుమార్‌పై వచ్చిన అభియోగాల విషయంలో తీసుకున్న తదుపరి చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆయన అదనపు ఎస్పీ హోదాలో పదవీ విరమణ చేశారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ శుక్రవారం రెండు వేర్వరు ఉత్తర్వులు జారీ చేశారు.


273 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon