- Neti Charithra
ఇటలీ టూ... అమరావతి సైకిల్ పై 13,522 కిలోమీటర్ లు యువకుడి యాత్ర !

ఇటలీ..టూ అమరావతి .... సైకిల్ పై 13,522 కిలో మీటర్ల సైకిల్ యాత్ర !
అమరావతి: నేటి చరిత్ర (ఫిబ్రవరి2)
సైకిల్ సఫారీ ... మోజుతో ప్రపంచం ను చుట్టాలనుకున్న ఓ ఇటలీ వ్యక్తి.. సైకిల్ పై అమరావతి కి చేరుకున్నాడు.
రెండేళ్ల కిందట తన యాత్ర మొదలుపెట్టారు. రోడ్డు మ్యాప్‌ను దగ్గరే ఉంచుకుని భారత్‌లోకి ప్రవేశించారు. ఆరు నెలలుగా భారత్‌లో వివిధ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ శనివారం నాటికి కృష్ణాజిల్లా కైకలూరు మండలం ఆటపాక గ్రామానికి చేరుకున్నారు. ప్రపంచంలోని వింతలు, విశేషాలు తెలుసుకోవాలనే ఆకాంక్షతో సైకిల్‌పై ప్రయాణిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక గుర్తింపుతో పాటు భిన్నప్రాంతాలు, దేశాలు, ఆచార వ్యవహారాలు తెలుసుకోవడానికి, వివిధ రకాల మనస్తత్వాలున్న వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. సైకిల్‌పైనే ఆహార పానీయాలు సమకూర్చుకుని బస చేసిన ప్రాంతంలో స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

తన ప్రయణం వివిధ దేశాల మీదుగా జపాన్ వరకు కొనసాగిస్తానని, ఇప్పటివరకు 13,511 కిలోమీటర్లు ప్రయాణించినట్లు వివరించారు. భారతీయులు సహృదయులని, తన సైకిల్ యాత్రకు సాదరంగా స్వాగతం పలుకుతూ మద్దతు ఇవ్వడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. పలువురు యువకులతో సెల్పీలు తీసుకున్నారు.