• Neti Charithra

ఆ.. రెండు రాష్ట్రాల్లో అడుగు పెట్టదు.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణా సర్కారు !


ఆ.. రెండు రాష్ట్రాల్లో అడుగు పెట్టదు.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణా సర్కారు !హైదరాబాద్‌:నేటి చరిత్రకరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో తెలంగాణా

సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల వైపు వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి

నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నందున ఈ చర్య తీసుకుంది. సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలు వైద్యం, అత్యవసర పనులకు కూడా ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని ప్రకటించింది. దానిని అమలు చేయడానికి పోలీసు బలగాలను పెంచింది. ఏపీలోని కర్నూలులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం... అక్కడికి గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజలు వెళుతున్న నేపథ్యంలో రాకపోకలను నిషేధించింది. అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాల వారు విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి వీలు లేకుండా పోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు లో రాకపోకలు పూర్తిగా నిలిచిపో యాయి.