- Neti Charithra
ఆ.. నిర్ణయం తీసుకుంటే.. బిజెపి కండువా కప్పుకుంటా...- జేసీ దివాకర్ రెడ్డి !

అనంతపురం:నేటి చరిత్ర (జనవరి5)
త్వరలో జరిగే జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగవుతాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 370 ఆర్టికల్ రద్దును సమర్థిస్తున్నాని, కొన్ని విషయాల్లో ప్రధాని మోదీకి జై అనాల్సిందేనని దివాకర్ రెడ్డి అన్నారు.

భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను అనంతపురం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఇవాళ జేసీ కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. జాతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం తగ్గిపోతోందని చెప్పారు. అయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు తెలుగుదేశంలో ఉంటానని జేసీ స్పష్టం చేశారు. కానీ, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటే మాత్రం భాజపాలో చేరుతానన్నారు.
61 views0 comments