• Neti Charithra

ఆంధ్రా భవన్ కు తాకిన కరోనా.. ఏపీ ఉన్నతాధికారి కి పాజిటివ్.. ఐదు రాష్ట్రాల ను అప్రమత్తం చేసిన కేంద్రం


ఆంధ్రా భవన్ కు తాకిన కరోనా.. ఏపీ ఉన్నతాధికారి కి పాజిటివ్.. ఐదు రాష్ట్రాల ను అప్రమత్తం చేసిన కేంద్రం



ఢిల్లీ: నేటి చరిత్ర


దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రా భవన్ కు కరోనా.. వైరస్ తాకడం తో ఐదు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా

ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో పనిచేస్తున్న అధికారికి కరోనా సోకింది. ఆదివారం ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించడంతో ఎపి, తెలంగాణ భవన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.

వెంటనే ఆ అధికారి కార్యాలయం, ముఖ్య ప్రాంతాలను శానిటైజ్‌ చేశారు. అనంతరం ఉమ్మడిభవన్‌ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఎపి ఆర్‌సి ఆఫీస్‌ ఆదేశాలు జారీ చేసింది. కరోనా సోకిన అధికారితో నేరుగా కాంటాక్ట్‌ అయిన భవన్‌ సిబ్బంది సెల్ఫ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లాలని

సూచించింది. ఉద్యోగులు, సిబ్బంది ఎలాంటి ఆరోగ్య సమస్యలూ కన్పించినా వైద్యులను ఆశ్రయించాలని పేర్కొంది. కాగా, భవన్‌ కీలక అధికారికి వైరస్‌ సోకడంతో ఎపి ఉద్యోగుల్లో ఆందోళన కన్పించింది. సీనియర్‌ అధికారి కావడంతో, ఎపిభవన్‌లోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది పలుమార్లు ఆయనతో భేటి అయినట్టు తెలిసింది. ఎపి సిఎంఒకు చెందిన ముఖ్య అధికారి సైతం తాజాగా ఢిల్లీ పర్యటనలో కరోనా సోకిన అధికారితో సన్నిహితంగా తిరిగారని చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఆ అధికారి సైతం శనివారం తిరిగి ఎపికి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనతో తేరుకున్న తెలంగాణ భవన్‌ ఉన్నతాధికారులు సైతం తమ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యంపై దఅష్టి సారించింది. ఒకే కాంప్లెక్స్‌లో ఇరు రాష్ట్రాల కార్యాలయాలు ఉన్నందున, వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువని అంచనా వేసింది. దీంతో భవన్‌ సిబ్బంది రెండు రోజులు విధులకు రావద్దని ఆదేశించినట్టు భవన్‌ వర్గాలు తెలిపాయి.

పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా ఇటీవల ఆంధ్రా భవన్ సముదాయాల్లో ఐదు రాష్ట్రాల కు చెందిన పలువురు కీలక నేతలు, అధికారులు పలు మార్లు భారీగా రాక పోకలు సాగించిన వారందరూ.. హైరానా పడుతున్నారు.